యువత అవసరాలకు తగ్గట్టుగా, బడ్జెట్ ధరల్లో 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న నేపథ్యంలో, రూ.15,000 లోపు లభించే ఉత్తమ 5జీ స్మార్ట్ఫోన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రస్తుత తరం యువత కేవలం కమ్యూనికేషన్ కోసమే కాకుండా, గేమింగ్, హై-క్వాలిటీ రీల్స్ మేకింగ్, నిరంతర సోషల్ మీడియా బ్రౌజింగ్ వంటి కార్యకలాపాల కోసం అత్యాధునిక స్మార్ట్ఫోన్లను ఆశిస్తున్నారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా, ప్రముఖ మొబైల్ కంపెనీలు యువత అభిరుచులకు, వారి బడ్జెట్‌కు సరిపోయేలా మార్కెట్లోకి బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇటీవల దేశీయ మొబైల్ బ్రాండ్ లావా, 'లావా షార్క్-2 5జీ' (Lava Shark-2 5G) అనే సరికొత్త 5జీ ఫోన్‌ను రూ.11,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ విడుదల నేపథ్యంలో, రూ.15,000 బడ్జెట్ ధరలో లభిస్తున్న టాప్ 5జీ స్మార్ట్ఫోన్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.









