డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి దారితీసిన జనవరి 28 నాటి విమాన ప్రమాదంపై సమగ్ర, పారదర్శక విచారణ జరపాలని కోరుతూ ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పూణే జిల్లాలోని బారామతి వైమానిక స్థావరం సమీపంలో కూలిపోయిన 'లియర్ జెట్ 45XR' విమాన నిర్వహణ సంస్థ అయిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు, ఆ సంస్థకు విమానయాన మంత్రితో ఉన్న సంబంధాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని రోహిత్ పవార్ తన లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్రమాదంపై లోతైన విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ ప్రధానిని కోరారు. విమాన భద్రతా ప్రమాణాలపై కూడా సమగ్ర సమీక్ష జరపాలని ఆయన సూచించారు. ప్రమాదానికి గల కారణాలను నిష్పాక్షికంగా తేల్చి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












