
వెస్టిండీస్తో జరగనున్న ఐదో టీ20 అంతర్జాతీయ మ్యాచ్కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. హైదరాబాద్లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా భారత బౌలర్ అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేస్తూ భుజానికి గాయపడ్డాడు.


















