ఖాతా నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు సంబంధించిన క్రియాశీల సిమ్ కార్డు అదే పరికరంలో ఉండేలా యాప్‌లు నిర్ధారించాల్సి ఉంటుంది. అంటే, మీరు వాట్సాప్ ఖాతా తెరిచిన నంబర్ సిమ్‌ను ఫోన్ నుంచి తీసేస్తే లేదా ఆ నంబర్ పనిచేయకుండా పోతే, యాప్ వినియోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఏ పరికరాలపై ఎలా అమలు చేస్తారన్నది ఆయా యాప్‌ల సాంకేతిక అమలుపై ఆధారపడి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏ యాప్‌లకు వర్తిస్తాయి
కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ జారీ చేసిన ఆదేశాల్లో వాట్సాప్, టెలిగ్రామ్‌తో పాటు సిగ్నల్, స్నాప్‌చాట్, అరట్టై, షేర్‌చాట్, జోష్, జియోచాట్ వంటి యాప్‌లు ఉన్నాయి. భారతీయ మొబైల్ నంబర్లను వినియోగదారుల గుర్తింపునకు ఉపయోగించే ఈ సేవలు క్రియాశీల సిమ్‌తో అనుసంధానమై ఉండేలా చర్యలు తీసుకోవాలి.