
రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం (అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్) అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.

పులివెందుల పట్టణంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన పోలీసు స్పందనను మెరుగుపరిచే లక్ష్యంతో అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్ ఐ.పీ.ఎస్, వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ ప్రారంభించారు.

ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్‌పై రెండు రోజుల వర్క్ షాప్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. తాను స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మల వంటి వారి జీవితాల్లో పథకాల ద్వారా వచ్చిన మార్పును ఆయన వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, మైనారిటీల సంక్షేమం, సాధికారత, మరియు పారదర్శక న్యాయపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక పురోగతి సాధించిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు. గత రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలు, న్యాయ సంస్కరణలు అమలు చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన ఆలోచనలను అన్వేషించే, నూతన జ్ఞానాన్ని సంపాదించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక కీలకమైన మైలురాయిని అధిగమించిందని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సంస్థగా మారడానికి దార్శనికతను అభివృద్ధి చేసుకుందని ప్రశంసించారు.

కడప నగర వన్ టౌన్ పోలీసులు బుధవారం ట్రాన్స్జెండర్లకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. సి.ఐ తిమ్మారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో చట్టానికి వ్యతిరేక చర్యలపై హెచ్చరికలు కూడా ఇచ్చారు.

డోన్ పట్టణంలో రూ.2 కోట్ల వ్యయంతో 115 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ద్రోణాచార్య నగర వనాన్ని డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ వనాన్ని తీర్చిదిద్దినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అత్యాధునిక వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలు వంటి సౌకర్యాలు కల్పించారు.

నంద్యాల జిల్లా డోన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎం. వేణుగోపాల్ రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమై, శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప నగరంలోని పలు వార్డు సచివాలయాలను బుధవారం సందర్శించారు. బీఎల్వోలు చేపడుతున్న ఓటరు వివరాల నమోదు, దరఖాస్తుల ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో దేశంలో నిర్మిస్తున్న విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్ఫూర్తితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'స్వర్ణాంధ్ర - 2047' దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించి, భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ముర్ము, మంత్రి లోకేష్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు వాతావరణ మార్పులు సవాల్‌గా మారాయి. ఎల్‌నినో గండం పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించడంతో, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ప్రత్యేక పంట ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రాంతీయ వాతావరణం, నేల స్వభావం ఆధారంగా రైతులకు మార్గదర్శకాలు రూపొందించింది.

పేద ప్రజల ఆపదలో ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో 22,13,716 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

పేద ప్రజల ఆపదలో ఆదుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో 22,13,716 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జులై 3, 2026న జమ్మలమడుగులోని జెఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్న నేపథ్యంలో, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని రామిరెడ్డి పల్లె రోడ్ లో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ నందు యూనిఫామ్, షూస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.

జమ్మలమడుగులో జూలై 03న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, జె.ఎస్.డబ్ల్యూ రాయలసీమ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను అధికారులు బుధవారం సాయంత్రం పరిశీలించారు. హెలిప్యాడ్, స్టీల్ ప్లాంట్ వద్ద జరుగుతున్న పనులను వారు పర్యవేక్షించారు.

కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి మంగళవారం పదవీ విరమణ పొందిన ఎస్. నూర్జహాన్ గారిని, కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ గారు సన్మానించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ గారి సేవలను డీఐజీ ప్రవీణ్ కొనియాడారు.

పేద ప్రజలకు అండగా నిలవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనసుకు నిదర్శనమని ఏపీ న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముగ్గురికి రూ. 5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు.