రాయచోటి, 31 October
అన్నమయ్య జిల్లా మండలం నక్కవాండ్లపల్లిలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. ఒంటరిగా ఉంటున్న 75 ఏళ్ల వృద్ధురాలు చాకిబండ చిన్నక్క ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమె గొంతు కోసి హత్య చేశారు. బంగారు ఆభరణాల కోసమే ఈ హత్య జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అన్నమయ్య జిల్లా: మండలం నక్కవాండ్లపల్లిలో శనివారం దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. 75 ఏళ్ల వృద్ధురాలు చాకిబండ చిన్నక్కను గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి గొంతు కోసి హత్య చేశారు.
ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసమే హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతురాలి మెడలోని బొట్టు గొలుసు, చేతికి ఉన్న ఉంగరం, చెవులకు ఉన్న కమ్మలు మాయమైనట్లు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల దర్యాప్తు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, జాగిలాల సహాయంతో ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

