వైఎస్ఆర్ జిల్లా వీరబల్లి పరిధిలోని ఎలుకచెట్టుపల్లి గ్రామంలో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎస్ఐ సుష్మిత ఆధ్వర్యంలో గ్రామస్థులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ సుష్మిత మాట్లాడుతూ, మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, యువత సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, మెసేజ్‌లకు స్పందించవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం ప్రమాదకరమని తెలిపారు.
మహిళలు ఏదైనా ఇబ్బందికి గురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని, డయల్ 100 లేదా 112కు కాల్ చేయాలని, దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

