తారన్, 26 జనవరి 2026
పంజాబ్‌లో పలు నేరాలకు పాల్పడి, ఇథియోపియాలో అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ గుర్విందర్ సింగ్ అలియాస్ అఫ్రిదిని పోలీసులు భారత్‌కు తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గుర్విందర్ను పట్టుకోవడానికి పంజాబ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌కు ఆపరేషన్ షాహిద్ అని పేరు పెట్టారు. నుంచి ప్రత్యేక నిఘా ప్రారంభించారు. ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో అతడి కదలికలను గుర్తించారు. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ నోటీసు జారీ చేయించారు. ఏడు ఇంటర్‌పోల్ రిఫరెన్సుల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సమాచారం సేకరించారు.
చివరకు ఇథియోపియాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారత్‌కు డిపోర్ట్ చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పంజాబ్ పోలీసులు అతడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
30కి పైగా క్రిమినల్ కేసులు
పంజాబ్ పోలీసుల వివరాల ప్రకారం, గుర్విందర్ సింగ్ డోని బాల్ప్రభ్ దస్సువాల్ గ్యాంగ్‌లో కీలక నాయకుడిగా వ్యవహరించాడు. అతడిపై 30కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో ఐదు హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, బెదిరింపులు, అక్రమ వసూళ్లు, తుపాకులతో కాల్పులకు సంబంధించిన కేసులు, ఆయుధ చట్టం కింద కేసులు ఉన్నాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

