కామారెడ్డిలో నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ, ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి.
కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, రైల్వే పోలీసుల సహకారంతో మంగళవారం రైలులో తనిఖీలు నిర్వహించారు. సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్నట్లు అందిన నమ్మదగిన సమాచారంతో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
6 కిలోల గంజాయి లభ్యం
ఈ తనిఖీల్లో భాగంగా 6 కిలోల ఎండు గంజాయి లభ్యమైందని అధికారులు తెలిపారు. అయితే, గంజాయిని తరలిస్తున్న నిందితులు మాత్రం పట్టుబడలేదు. వారి ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తనిఖీల్లో పాల్గొన్న బృందం
ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, డీటీఎఫ్ సీఐ సుందల్ సింగ్, ఎస్సైలు విక్రమ్‌కుమార్, శ్రీనివాసరావు, శరత్‌కుమార్, ట్రైనీ ఎస్సైలు అనిల్, మధు, సిబ్బంది జాన్, ఫరీద్, అమృత్‌రెడ్డి, శంకర్, పవన్, నర్సింలు, శరత్, దినేష్, రాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.

