మండలం, వెల్లాల గ్రామంలో చెన్నకేశవ స్వామి నూతన ఆలయ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి భూమిపూజ చేశారు. సీజీఎఫ్ నిధులతో రూ. 4 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే హామీ
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల మనోభావాలకు అనుగుణంగా, పురాతన కట్టడాలను పరిరక్షిస్తూ, అత్యాధునిక హంగులతో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.





