తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులు, ఉప ఆలయాలు, పరివార దేవతలు, విమాన ప్రాకారం, ధ్వజస్తంభానికి పవిత్రాలను సమర్పించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పవిత్ర సమర్పణ చేపట్టారు.












