కడప నగరంలోని మహావీర్ సర్కిల్లో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం నుండే ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పండ్లు, పలహారాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో మూలవిరాట్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి రంగురంగుల పుష్పాలతో పుష్పాభిషేకం, దీపాలంకరణ సేవ, విశేష అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుంటే సంతాన దోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వామివారికి పాలాభిషేకం చేసి, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు.












