పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తిరుపతి పోలీస్ పేరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు ఎస్పీ (పరిపాలన) ఏ. శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసుల విధులు, ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
పోలీసు శాఖలో వినియోగించే ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, నేర పరిశోధనలో ఉపయోగించే వ్యవస్థలను విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం చేస్తూ, పోలీసుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసు శాఖలో వినియోగించే ఆయుధాలు, మెటల్ డిటెక్టర్లు, డ్రాగన్ లైట్లు, రాకర్లు, బాంబు డిస్పోజల్ పరికరాలు, వాటి పనితీరును వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేర పరిశోధనలో ఈ పరికరాలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేశారు. పోలీసు శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషించే పాత్రను విద్యార్థులు అర్థం చేసుకోవాలని అధికారులు సూచించారు.












