ఉస్మానియా యూనివర్సిటీలో మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జాబ్ మేళా జరగనుంది. డిగ్రీ లేదా డిప్లమా అర్హత కలిగిన యువతకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ సహకారంతో ఈ నెల 30న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో జరగనుంది. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లోని జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా ఉత్తీర్ణులై, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న అభ్యర్థులకు ఈ మేళాలో పాల్గొనే అవకాశం ఉందని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగాలకు సుమారు రూ.20,000 వరకు వేతనం అందించనున్నట్లు సమాచారం. ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం రీజినల్ మేనేజర్ రవీందర్ కుమార్ ను సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద నేరుగా హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





