జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు కింద ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టనున్న పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. మోడల్ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక నివేదికలను సిద్ధం చేసి పనులను చేపట్టాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జిల్లాలో మొత్తం 396 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనులన్నీ మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని, ప్రధానోపాధ్యాయులు, సంబంధిత ఇంజినీరింగ్, నీటి సరఫరా శాఖల అధికారుల సమన్వయంతో అమలు చేయాలని సూచించారు.












