ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజే కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 6, 7 తరగతులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు పాఠశాలకు తాళాలు వేసి నిరసన చేపట్టారు.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత తరగతులను కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరగతులను తొలగించడం వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని, సుమారు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పాఠశాల యాజమాన్యం మరియు విద్యాశాఖ అధికారుల తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత తరగతులను వేరే పాఠశాలకు తరలించే యోచన ఉందని గ్రామస్తులు తెలిపారు, అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.












