రాజంపేట, 2026-08-10
రాజంపేటలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో మైనర్లపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, మైనర్ డ్రైవింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసాలు వంటి వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం.రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజంపేటలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో మైనర్లపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, మైనర్ డ్రైవింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసాలు వంటి వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం.రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారం, రాజంపేట సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ ఆంజనేయులు సార్ సూచన మేరకు శ్రీ నర్సింగరావు గారి ఆధ్వర్యంలో జరిగింది.
పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు.యు.శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు తమ మాటలు, పాటల ద్వారా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నంబర్ 1908, షీ టీమ్ నంబర్ 8712686094, అత్యవసర సమయంలో 100/112 డయల్ చేయాలని సూచించారు.

