తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ డ్రామా అదే నీవు అదే నేను తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ వేదికపై అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
కొండల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. తన్వీ నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కనిష్క సంగీతం అందించగా, శ్రీలక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై కొండ్రేగుల గోవిందు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం 2026 జులై 31న థియేటర్లలో విడుదలైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భార్యాభర్తల బంధం చుట్టూ కథనం
సాగర్ (యశ్వంత్ పెండ్యాల), శ్రీవల్లి (తన్వీ నేగి) పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇద్దరూ ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తూ అన్యోన్యంగా ఉంటారు. ఈ క్రమంలో కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కార్తీక్ ఓ ప్రాజెక్టు పని మీద హైదరాబాద్‌కు వస్తాడు. తన మాటతీరుతో అందరినీ ఆకట్టుకునే కార్తీక్.. శ్రీవల్లికి కూడా దగ్గరవుతాడు. తాను వివాహిత అనే విషయం తెలిసినా అతడితో సాన్నిహిత్యం పెంచుకుంటుంది.
మరోవైపు భర్త సాగర్ గురించి శ్రీవల్లికి కొన్ని అనూహ్యమైన విషయాలు తెలుస్తాయి. ఈ పరిణామాలతో ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి కార్తీక్‌తో ఆమె సంబంధం ఎటువైపు వెళ్లింది చివరకు ఈ ముగ్గురి జీవితాల్లో ఏం జరిగింది అనేది సినిమా కథలో ఆసక్తికరమైన అంశాలు.

