నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'పోలీస్ కంప్లైంట్' సినిమా ప్రమోషన్ల విషయంలో నెలకొన్న వివాదంపై దర్శకుడు సంజీవ్ మేగోటి స్పందించి, నటికి క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం ముగిసినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'పోలీస్ కంప్లైంట్' సినిమా ప్రమోషన్ల విషయంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. ఆమె తన సినిమా ప్రచార కార్యక్రమాలకు సహకరించడం లేదని, డబ్బులు తీసుకుని కూడా హాజరు కావడం లేదని దర్శకుడు ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఆరోపణలకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ, సినిమా బృందం పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరయ్యానని, తనకు తెలిసినంత వరకు అన్నింటిలోనూ పాల్గొన్నానని తెలిపారు. దర్శకుడి వ్యాఖ్యలపై తనకు పూర్తి అవగాహన లేదని, అందుకే స్పందించలేకపోయానని ఆమె పేర్కొన్నారు.






