కేరళలోని కొచ్చి వాటర్ మెట్రోలో కొందరు పర్యాటకులు సాంప్రదాయ గర్బా నృత్యం చేస్తూ సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ ప్రవర్తనను విమర్శించగా, మరికొందరు సమర్థించారు.
ఫార్ట్ కొచ్చికి వెళ్లే దారిలో కొచ్చి వాటర్ మెట్రోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో షేర్ అయిన ఈ వీడియోలో, పర్యాటకులు పాటలు పాడుకుంటూ, గుండ్రంగా తిరుగుతూ ఉత్సాహంగా గర్బా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ చర్య ప్రజా రవాణా నియమాలను ఉల్లంఘించడమా కాదా అనే దానిపై చర్చ మొదలైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
చాలా మంది నెటిజన్లు ఈ ప్రవర్తనను విమర్శించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరికీ సంబంధించినదని, వ్యక్తిగత వేదిక కాదని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. అంతగా వినోదం కోరుకుంటే ప్రైవేట్ బోట్ అద్దెకు తీసుకోవాలని సూచించారు.






