గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కీలక విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులను పునరుద్ధరించాలని ఆయన కోరారు.
తెలంగాణలో గద్దర్ అవార్డులను పునరుద్ధరించిన సీఎం రేవంత్ రెడ్డిని ఆర్. నారాయణమూర్తి ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా నంది అవార్డుల కోసం ఎదురుచూస్తున్నామని, వాటి పునరుద్ధరణ సినీ పరిశ్రమకు ఎంతో అవసరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
"చంద్రబాబు గారూ.. మీకు దండం పెడతాం, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి.. దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులను పునరుద్ధరించండి" అని ఆయన వినయంగా కోరారు. నంది అవార్డులు కళాకారులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.











