వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. యువ కథానాయకుడు సంతోష్ శోభన్ నటించిన ఈ చిత్రం తనకు చాలా నచ్చిందని, ఒక లవ్లీ, బ్యూటీఫుల్ ఫిలిం అని ఆయన పేర్కొన్నారు.
వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి ఊహించని మద్దతు లభించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రంపై ప్రభాస్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనకు 'వర్షం' సినిమా ఎలాంటిదో, అలాగే యువ కథానాయకుడు సంతోష్ శోభన్‌కు 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా కూడా అలాంటిదేనని ప్రభాస్ పోస్ట్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సినిమా ఒక లవ్లీ, బ్యూటీఫుల్ ఫిలిం అని, తాను బాగా ఎంజాయ్ చేశానని ప్రభాస్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సంతోష్, మానస వారణాసి జోడి అద్భుతంగా ఉందని, దర్శకుడు అశ్విన్ ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ఆయన ప్రశంసించారు. ఇలాంటి కథలను వెండితెరపైకి తీసుకువచ్చినందుకు అజయ్, యువీ క్రియేషన్స్ టీమ్ మొత్తానికి ప్రభాస్ అభినందనలు తెలియజేశారు.











