టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహబంధంతో ఒక్కటికానున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనున్న ఈ వివాహానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ భద్రతా సంస్థను నియమించినట్లు సమాచారం.
ఇన్నాళ్లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గల ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. పెళ్లికి కొద్దిరోజుల ముందు నుంచే విజయ్ ఇంట్లో అలంకరణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తోంది. గోప్యతను కాపాడేందుకు, అతిథుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అంతర్జాతీయ భద్రతా ఏజెన్సీ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.
వివాహ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే కొందరికి చేరినట్లు సమాచారం. ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహ అనంతరం హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ వేడుకను నిర్వహించే యోచనలో ఈ జంట ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్, రష్మికల పెళ్లి వార్త ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి కెమిస్ట్రీ తెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ కొనసాగుతుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












