ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ షాపులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న వెంకట సాయి మెడికల్ షాపును సోమవారం సీజ్ చేశారు. ఈ చర్యకు దినపత్రికల్లో వచ్చిన కథనాలే కారణమయ్యాయి.
శనివారం పలు దినపత్రికల్లో మెడికల్ షాపులోనే వైద్యం అనే కథనం రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వి. మల్లేష్ వెంటనే స్పందించి, సోమవారం ఆ షాపుపై ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తనిఖీ సమయంలో షాపు ప్రొప్రైటర్ రమణ ఎలాంటి వైద్య అర్హత లేకుండానే ఒక చిన్నారికి ఇంజెక్షన్ చేస్తూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. షాపు ఆవరణలో తనిఖీ చేయగా వాడేసిన యాంటీబయాటిక్ సిరంజిలు, మందుల సీసాలు, అనుమతి లేని స్టెరాయిడ్స్ వాడినట్లు ఆధారాలు లభించాయి.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, అర్హత లేకుండా వైద్యం చేయడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి, వెంకట సాయి మెడికల్ షాపును సీజ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం బద్వేల్ పట్టణంలోని పలు మెడికల్ షాపులు, ఆసుపత్రులలోని మెడికల్ షాపుల్లో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల ఈ చర్య పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగాలని కోరుతున్నారు.

