సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్స్ లో మెదడు, వెన్నెముక సంబంధిత సంక్లిష్ట వ్యాధులకు అత్యాధునిక సాంకేతికతతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సెంటర్ ఫర్ న్యూరోఎండోస్కోపీ అండ్ రోబోటిక్ న్యూరోసర్జరీ ప్రత్యేకంగా పనిచేస్తోంది. డా. అయ్యదురై ఆర్, డా. కృష్ణ తేజ్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందిస్తున్నారు.
ఈ కేంద్రంలో మెదడు కణితులకు అధునాతన శస్త్రచికిత్సలు, మందులతో నియంత్రణలోకి రాని మూర్ఛకు శస్త్రచికిత్స, ట్రైజెమినల్ న్యూరల్జియా, మెదడులో రక్తస్రావం, వెన్నెముక సమస్యలకు కనిష్ట ఇన్వాసివ్ విధానాల్లో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స సమయంలో ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ సాంకేతికతను ఉపయోగించి కణితి తొలగింపు స్థాయిని అంచనా వేయడంతోపాటు కీలకమైన మెదడు భాగాలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ట్రైజెమినల్ న్యూరల్జియాకు సంబంధించి ఇప్పటివరకు 110 శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు ఒక ప్రత్యేక క్లినిక్, అవగాహన బృందాన్ని ప్రారంభించింది.
ఎండోస్కోపిక్, రోబోటిక్ సాంకేతికతలతో శస్త్రచికిత్స గాయాన్ని తగ్గించడం, త్వరగా కోలుకునేందుకు తోడ్పడటం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని వైద్యులు తెలిపారు. రోగి పరిస్థితిని బట్టి తగిన చికిత్సా విధానాన్ని ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి

