క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్ పరిమితి విధించడంతో వాటి కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా 85 ఔషధ కంపెనీలు 1,364 క్యాన్సర్ ఔషధ ఫార్ములేషన్లకు సవరించిన గరిష్ఠ చిల్లర ధరలను () సమర్పించాయి.
వీటిలో కొన్ని మందుల ధరలు ఏకంగా 96.45 శాతం వరకు తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ వివరాల ప్రకారం.. ఈ ధరల తగ్గింపుతో వినియోగదారులకు ఏటా సుమారు రూ.3,540.38 కోట్ల ఆదా కలగనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
679 బ్రాండ్ల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పలు కీలక ఔషధాల ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కొన్ని మందుల పాత, కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి: () పాత ధర 25,995 కాగా, కొత్త ధర 3,318. పాత ధర 24,955 కాగా, కొత్త ధర 6,240. 2 పాత ధర 83,520 కాగా, కొత్త ధర 37,358.35.
ధరలు ఒక్కో ప్యాక్ లేదా ఫార్ములేషన్‌కు సంబంధించినవి. కొనుగోలు ముందు ప్యాక్‌పై ఉన్న సవరించిన ని పరిశీలించాలి. కొత్త ధరల కంటే ఎక్కువ వసూలు చేయడానికి రిటైలర్లు, ఆసుపత్రుల ఫార్మసీలకు అనుమతి లేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

