ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నివసిస్తున్న భారత సంతతి దంపతులు ఆశిష్ శర్మ, మనాలి పురోహిత్‌కు తీవ్ర విషాదం ఎదురైంది. తమ జీవితకాలపు పొదుపుతో నిర్మించుకున్న అనే వీగన్ కేఫ్, పొరుగున ఉన్న పొగాకు దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో లక్ష ఆస్ట్రేలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.
మెల్బోర్న్లోని ఫిట్జ్రాయ్ నార్త్ ప్రాంతంలో ఆశిష్ శర్మ, మనాలి పురోహిత్ దంపతులు ఎంతో కష్టపడి పేరుతో ఒక శాకాహార (వీగన్) కేఫ్‌ను ప్రారంభించారు. కేఫ్‌ను ఏర్పాటు చేయడానికి వారు ఐదు నెలల పాటు శ్రమించి, తమ జీవితకాలపు పొదుపులోంచి సుమారు 1 లక్ష ఆస్ట్రేలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.60 లక్షలు) పెట్టుబడిగా పెట్టారు. ఖర్చులు తగ్గించుకోవడానికి సెకండ్‌హ్యాండ్ ఫర్నిచర్ కొనుగోలు చేసి, పెయింటింగ్‌తో సహా అనేక పనులను స్వయంగా చేసుకున్నారు. 2023లో ఈ కేఫ్‌ను ప్రారంభించారు. అయితే, కేఫ్ ప్రారంభించిన మూడు నెలలు కూడా గడవకముందే ఈ దుర్ఘటన వారి కలలను కల్లలు చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యుద్ధభూమిలా మారింది.. దొంగతనం కూడా
అగ్నిప్రమాదం తర్వాత తమ కేఫ్‌ను చూసినప్పుడు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పైకప్పు కరిగిపోయి, ఎక్కడ చూసినా మసి, శిథిలాలు కనిపించాయని తెలిపారు. తమ కలల వ్యాపారం ఇలా నాశనమవడం ఎంతో బాధ కలిగించిందని చెప్పారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే మరో దురదృష్టకర పరిణామం చోటుచేసుకుంది. ధ్వంసమైన కేఫ్ నుంచి సుమారు 5,000 ఆస్ట్రేలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి దొంగిలించబడినట్లు వార్తా కథనం వెల్లడించింది.











