భారత్‌తో ఇప్పటికే ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని లీచ్టెన్స్టెయిన్ వారసత్వ యువరాజు అలోయిస్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో లీచ్టెన్స్టెయిన్ చేపట్టిన తొలి అధికారిక దేశ పర్యటన సందర్భంగా యువరాజు అలోయిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో యువరాజు అలోయిస్, ఆయన భార్య యువరాణి సోఫీకి అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వాగతం పలికారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత పర్యటనపై యువరాజు స్పందన
భారత్‌లో పర్యటించడం గౌరవంగా భావిస్తున్నానని అలోయిస్ తెలిపారు. ఇరు దేశాల సంబంధాలకు లీచ్టెన్స్టెయిన్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ చారిత్రక పర్యటన ప్రతిబింబిస్తోందని చెప్పారు. భారత్‌తో కుదిరిన వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ముందడుగు అని పేర్కొన్నారు.












