తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో మంగళవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్య దేశాల ప్రతినిధులకు ఆ దేశ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్ స్వాగతం పలికారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీఓ ప్రభుత్వాధినేతల మండలి 25వ సమావేశంలో పాల్గొనేందుకు భారత్ తరఫున రాజ్‌నాథ్ సింగ్ తజికిస్థాన్‌కు విచ్చేశారు.
ఈ నెల 20వ తేదీ నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, అనుసంధానం వంటి అంశాలపై చర్చించనున్నారు. దుషాంబేకు చేరుకున్న అనంతరం రాజ్‌నాథ్ సింగ్, తజికిస్థాన్ రక్షణ మంత్రి ఎమోమాలి సోబిర్జోడాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సైనిక సామర్థ్యాల పెంపు, శిక్షణ వంటి అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రక్షణ రంగంలో సహకారంపై దృష్టి
భారత్‌తో తమ దేశానికి ఉన్న సంబంధాలను మరింత విస్తరించాలనే ఆకాంక్షను రాజ్‌నాథ్ సింగ్ వ్యక్తం చేశారు. ముఖ్యంగా రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2021లో తాను తజికిస్థాన్‌ను సందర్శించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.












