ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు ప్రారంభించిన నేపథ్యంలో, రష్యా ఇరాన్‌కు సైనిక సమాచారం అందిస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలు అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.
అమెరికా గూఢచార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాల ఖచ్చితమైన లొకేషన్లను ఇరాన్‌కు చేరవేస్తోంది. దీనివల్ల ఇరాన్ అమెరికా స్థావరాలపై ఎదురుదాడులు చేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
రష్యా తన అధునాతన శాటిలైట్ నెట్వర్క్ ద్వారా ఇరాన్‌కు హై-క్వాలిటీ ఫోటోలను అందిస్తోందని, ఇరాన్ సొంతంగా గుర్తించలేని అమెరికా స్థావరాలను గుర్తించడంలో ఇది సహాయపడుతోందని సమాచారం.
రష్యా ఈ ఆరోపణలపై నేరుగా స్పందించనప్పటికీ, ఇరాన్‌తో నిరంతర సంప్రదింపుల్లో ఉన్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సైనికుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తమకు తెలుసునని పేర్కొన్నారు.
వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్, రష్యా సహకారం యుద్ధ గమనాన్ని మార్చలేదని, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తాము దెబ్బతీస్తున్నామని తెలిపారు. 2025 నాటి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం తర్వాత ఈ సహకారం పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

