గత నెల 28న ప్రారంభమైన సైనిక చర్యలు గురువారం కీలక మలుపు తిరిగాయి. ఇప్పటివరకు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన ఇరాన్, ఇప్పుడు గల్ఫ్ దేశాలకు చెందిన ఇంధన మౌలిక సదుపాయాలపై భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల నేపథ్యంలో, సౌదీ అరేబియా తొలిసారిగా ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించే చర్యలను సహించేది లేదని సౌదీ అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలకు దారితీశాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ దాడుల వెనుక గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.











