ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధ విధానాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌తో కలిసి కొనసాగుతున్న ఈ యుద్ధానికి అమెరికా భారీగా ఖర్చు చేస్తోందని, అదనంగా 200 బిలియన్ డాలర్ల నిధులు కోరడంపై విమర్శలు వస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే సుమారు 11.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. లక్ష కోట్లు) ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇరాన్‌పై సైనిక చర్యల కోసం అదనంగా 200 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 18.6 లక్షల కోట్లు) నిధులు మంజూరు చేయాలని పెంటగాన్ వైట్‌హౌస్‌ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వార్షిక బడ్జెట్ దాదాపు 81 లక్షల కోట్ల రూపాయలు కలిగిన పెంటగాన్, అదనంగా ఇంత భారీ మొత్తాన్ని కోరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం యొక్క ఆర్థిక భారంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.











