ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదించిన 'హెక్సాగన్ ఆఫ్ అలయన్స్' కూటమిపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కూటమిని ముస్లిం వ్యతిరేక చర్యగా పేర్కొంటూ పాకిస్థాన్ సెనేట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ముందుకు తెచ్చిన 'హెక్సాగన్ ఆఫ్ అలయన్స్' కూటమి ప్రతిపాదన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్‌తో పాటు మరికొన్ని అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు ఇందులో భాగస్వాములు కానున్నాయని సమాచారం. మధ్యప్రాచ్యంలో తీవ్రవాద శక్తులను ఎదుర్కోవడం దీని ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కూటమిలో భారత్ కీలక సభ్యుడిగా ఉండటంపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రతిపాదన ముస్లిం దేశాల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని, ఇది అంతర్జాతీయ శాంతికి విఘాతమని పాకిస్థాన్ అభివర్ణించింది. ఇరాన్ నేతృత్వంలోని 'రాడికల్ షియా' గ్రూపులు, ఐసిస్ వంటి 'రాడికల్ సున్నీ' శక్తులను ఎదుర్కోవడంతో పాటు, రక్షణ, నిఘా రంగాల్లో సహకారం అందించడం ఈ కూటమి ఉద్దేశ్యాలుగా పేర్కొంటున్నారు.











