అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.
పార్లమెంట్లో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, అయితే పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. భారతదేశ ఇంధన భద్రతకు మధ్యప్రాచ్యం కీలకమని, క్రూడాయిల్ ధరల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని ఆయన వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తోందని జైశంకర్ హామీ ఇచ్చారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.











