భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-1 ఉపగ్రహం సూర్యుడిపై జరిగే భారీ విస్ఫోటనాల గురించి కీలక విషయాలను వెల్లడించింది. సూర్యుడి వెలుపలి వాతావరణంలో ఏర్పడే భారీ ప్లాస్మా విస్ఫోటనాలు ఎలా విస్తరిస్తాయనే అంశంపై భారత శాస్త్రవేత్తలు కొత్త ఆధారాలను గుర్తించారు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఆదిత్య-1లోని విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పరికరం నుంచి వచ్చిన సమాచారాన్ని నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ చిత్రాలతో కలిపి విశ్లేషించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాధారణంగా సూర్యుడి నుంచి వెలువడే ఈ భారీ ప్లాస్మా మేఘాలు భూమి దిశగా ప్రయాణిస్తే ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అంతరిక్ష కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల అవి ఏ వేగంతో, ఏ దిశలో ప్రయాణిస్తాయో ముందుగానే అంచనా వేయడం చాలా ముఖ్యం.
ఆదిత్య-1లోని పరికరం డాప్లర్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికత ద్వారా ప్లాస్మా మనవైపు వస్తుందా లేదా మనకు దూరంగా వెళ్తుందా అనే విషయాలను గుర్తించగలదు. ఈ సమాచారంతో శాస్త్రవేత్తలు సూర్యుడిపై జరిగే విస్ఫోటనాల త్రిమితీయ స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

