భార్యాభర్తల మధ్య గొడవలు, వేధింపులు లేదా మనస్పర్థలు ఉన్నంత మాత్రాన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారించాలంటే నిందితుడి చర్యల్లో ఉద్దేశపూర్వక ప్రేరణ లేదా సహకరించే ప్రత్యక్ష చర్యలు ఉన్నట్లు ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది.
వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, వేధింపులు లేదా మనస్పర్థలు ఉన్నంత మాత్రాన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారించాలంటే నిందితుడి చర్యల్లో ఉద్దేశపూర్వక ప్రేరణ లేదా ఆత్మహత్యకు సహకరించే ప్రత్యక్ష చర్యలు ఉన్నట్లు ఆధారాలు ఉండాలని న్యాయస్థానం పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2020లో అనిస్సియా బాత్రా తన నివాసంలో మరణించారు. భర్త మయాంక్ సింఘ్వీ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె మరణానికి ముందు సందేశాలు పంపినట్లు కేసు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో భర్తపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, క్రూరత్వం వంటి అభియోగాలు నమోదయ్యాయి.
అయితే, మరణానికి ముందు పంపిన సందేశంలో భర్తను బాధ్యుడిగా పేర్కొన్నంత మాత్రాన ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం రుజువైనట్లు కాదని హైకోర్టు తెలిపింది. భారతీయ శిక్షాస్మృతిలోని 306వ సెక్షన్ ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించాలనే ఉద్దేశం, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించడం లేదా ఉద్దేశపూర్వకంగా సహకరించడం వంటి అంశాలు ఉండాలని హైకోర్టు వివరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!

