ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసనలు మళ్లీ ఉధృతమయ్యాయి. పోలీసుల ఆంక్షల మధ్య న పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నిరసనకారులు సుప్రీంకోర్టు వైపు మార్చ్ చేపట్టారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నాయకులు, ఇతర ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వరుసగా రెండు రోజులపాటు పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు చోటుచేసుకున్న తర్వాత ఈ భారీ ర్యాలీ జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఓటర్ల జాబితా సవరణపై అభ్యంతరాలు
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని, తొలగించిన పేర్లపై సమగ్ర పరిశీలన జరపాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఓటర్ల జాబితాలో మార్పులు అనర్హమైన లేదా నకిలీ నమోదులను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియలో భాగమని ఎన్నికల సంఘం చెబుతోంది. తప్పుగా తొలగించబడిన అర్హులైన ఓటర్లు తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి

