కర్ణాటకలో పండుగ సమీపిస్తున్న తరుణంలో నందిని పాల ఉత్పత్తుల ధరలు మరోసారి పెరిగాయి. బెంగళూరు మిల్క్ యూనియన్ (బీఎంయూ) నందిని బ్రాండ్‌కు చెందిన నెయ్యి, వెన్న, పనీర్ ధరలను సవరించింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
ఒక కిలో పనీర్ ధర రూ.408 నుంచి రూ.485కు, లీటర్ నెయ్యి ధర రూ.715 నుంచి రూ.850కు పెరిగింది. 500 గ్రాముల ఉప్పు కలిపిన వెన్న ధర రూ.310 నుంచి రూ.380కు చేరింది. ఇటీవలే కర్ణాటకలో లీటర్ పాల ధర రూ.8, పెరుగు ధర రూ.14 పెంచిన నేపథ్యంలో, ఈ తాజా నిర్ణయం వినియోగదారులపై అదనపు భారం మోపుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

