దేశంలో పేదరికం తగ్గినప్పటికీ, 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుందని, దీని వెనుక ఆహార భద్రత, కుటుంబ ఖర్చులు తగ్గించడం, పోషకాహారం మెరుగుపరచడం వంటి లక్ష్యాలున్నాయని ఆర్థికవేత్త శామికా రవి తెలిపారు.
దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని పలు నివేదికలు చెబుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం, గోధుమలు ఎందుకు పంపిణీ చేస్తోందనే ప్రశ్నకు ప్రధాని ఆర్థిక సలహా మండలి (-) సభ్యురాలు, ఆర్థికవేత్త శామికా రవి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. దేశంలో పేదరికం తగ్గినప్పుడు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నకు ఆమె స్పందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆమె అభిప్రాయం ప్రకారం, ఉచిత రేషన్ పథకం కేవలం పేదరిక నిర్మూలనకే పరిమితం కాదు. ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, కుటుంబాల ఖర్చులను తగ్గించడం, పోషకాహారంపై ఎక్కువ ఖర్చు చేసేలా ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యాలు. ఎందుకంటే మనకు ఆ సామర్థ్యం ఉంది అని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ రాజ్యంలో ప్రజలకు వివిధ రకాల సామాజిక భద్రత అవసరమని, ఆహార భద్రత అనేది పేదరికం ఒక్కదానితో ముడిపడిన అంశం కాదని ఆమె వివరించారు. రేషన్ ద్వారా ఆదా అయిన డబ్బును కుటుంబాలు పాలు, పండ్లు, గుడ్లు, చేపలు, మాంసం వంటి పోషకాహార పదార్థాల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని, పేదరికం తగ్గిందని ఆహార భద్రత అవసరం లేదని భావించకూడదని ఆమె సూచించారు.
ఎంతమందికి ఉచిత రేషన్ అందుతోంది
కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన () ద్వారా ఉచిత ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తోంది. ఈ పథకం పరిధిలో ప్రస్తుతం గుర్తించిన లబ్ధిదారులు సుమారు 80.48 కోట్లు. ఆహార, ప్రజా పంపిణీ శాఖ పేర్కొన్న గణాంకాల ప్రకారం, పథకం పరిధిలోని గరిష్ఠ లబ్ధిదారులు 81.35 కోట్లుగా ఉన్నారు.

