విధుల నిర్వహణలో చేసిన తప్పులకు క్షమాపణ చెప్పడం మాత్రమే సరిపోదని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభావితం చేసే అధికారాలను వినియోగించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించింది.
తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ. అరుణ్ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మద్రాస్ హైకోర్టు గతంలో ఆయనపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆర్. మహదేవన్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గూండా చట్టం కింద నిర్బంధం
ఏ. అరుణ్ గతంలో గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఒక వ్యక్తిని తమిళనాడు గూండా నిరోధక చట్టం-1982 కింద గూండాగా వర్గీకరిస్తూ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు వ్యక్తి, ఆయన భార్య ఒక నిర్మాణ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. అపార్ట్మెంట్ కొనుగోలు కోసం ఒక కొనుగోలుదారు రూ.1.38 కోట్లకు పైగా చెల్లించినప్పటికీ, ఫ్లాట్ అప్పగించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆస్తిని ఇతరులకు బదిలీ చేయడంతోపాటు, నకిలీ పత్రాలతో తనఖా పెట్టినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి.
హైకోర్టు రద్దు, ప్రతికూల వ్యాఖ్యలు
ఈ వ్యవహారంలో మోసం, నమ్మకద్రోహం, పత్రాల ఫోర్జరీ తదితర ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏ. అరుణ్ సదరు వ్యక్తిని గూండాగా పేర్కొంటూ 2022న నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ నిర్బంధితుడి కుమార్తె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం 2029న హైకోర్టు నిర్బంధ ఉత్తర్వులను రద్దు చేసింది. అదే సమయంలో పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఏ. అరుణ్ వ్యవహారశైలిపై తీవ్ర ప్రతికూల వ్యాఖ్యలు చేసింది.

