జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అగర్తలాలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది.
అగర్తలాలోని స్వామి వివేకానంద మైదానంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాణిక్ సాహా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో పటేల్ చేసిన కృషిని గుర్తుచేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.
రన్ ఫర్ యూనిటీ రూట్
ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించిన రన్ ఫర్ యూనిటీ స్వామి వివేకానంద మైదానం నుంచి ప్రారంభమై అగర్తలా నగరంలోని పలు వీధుల మీదుగా సాగింది. చివరగా ఉమాకాంత అకాడమీ ప్రాంగణంలో ముగిసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, త్రిపుర పోలీసు సిబ్బందితో పాటు పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

