ఉత్తరప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో గ్రామ, క్షేత్ర, జిల్లా స్థాయి పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓబీసీ రిజర్వేషన్లపై ప్రక్రియ పెండింగ్లో ఉన్నా ఎన్నికలు వాయిదా వేయరాదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ విధానంతోనే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కోర్టు పేర్కొంది. పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 27 శాతం రిజర్వేషన్తో పాటు, వర్తించే చట్టాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మహిళల రిజర్వేషన్లను కొనసాగించాలని తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఓబీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక ఆదేశాలు
ఓబీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ విచారణ పూర్తికాలేదనే కారణంతో ఆ వర్గానికి కేటాయించిన స్థానాలను సాధారణ స్థానాలుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, నిధులు, భద్రత తదితర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.





