కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే ఒక్క మాట మనసులకు గాయం చేస్తుందని, కోపం, ఆవేశంలో మాట్లాడే మాటలు మన సంబంధాలను దెబ్బతీస్తాయని బగళాముఖి తత్త్వం చెబుతోంది. మౌనం బలహీనత కాదని, అది వివేకమని ఈ తత్త్వం వివరిస్తుంది.
దక్షిణ్ న్యూస్ ఈ-పేపర్ వీక్షకులకు నమస్కారం. కాలమహిమ శుభోదయం. అమ్మవారి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాము. 294వ పరిష్కారం దశమహావిద్యల రహస్యాలు - ఎపిసోడ్ 8 బగళాముఖి మాటపై నియంత్రణే మనిషికి నిజమైన బలం కాలమహిమ కుటుంబ సభ్యులకు నమస్తే
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే ఒక్క మాట మనసులకు గాయం చేస్తుంది. కోపంలో జీవిత భాగస్వామిని బాధపెట్టే మాట అంటాం. ఆవేశంలో పిల్లలను ఇతరులతో పోల్చి వారి మనసును నొప్పిస్తాం. స్నేహితులతో చిన్న అపార్థం పెద్ద దూరానికి కారణమవుతుంది. కార్యాలయంలో ఆలోచించకుండా మాట్లాడి మన సంబంధాలను దెబ్బతీసుకుంటాం. తర్వాత బాధపడతాం, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అనుకుంటాం.











