కొత్తగూడెం, 10 November
భద్రాద్రి జిల్లాలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, నవంబర్ 10:
జిల్లాలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంగళవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని నేర పరిస్థితులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, కోర్టు సంబంధిత అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
కేసుల దర్యాప్తుపై ఎస్పీ సూచనలు
పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా పాటించాలని ఎస్పీ సూచించారు.

