భద్రాచలం, 10 November
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన దుకాణాల నిర్వహణ, ఖాళీ స్థలాల వినియోగం, శీతల పానీయాలు, దీపారాధన ఒత్తుల విక్రయ హక్కుల కేటాయింపునకు ఈ నెల 12న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, నవంబర్ 10:
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన దుకాణాల నిర్వహణ, ఖాళీ స్థలాల వినియోగం, శీతల పానీయాలు, దీపారాధన ఒత్తుల విక్రయ హక్కుల కేటాయింపునకు ఈ నెల 12న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వేలం ప్రక్రియ గురువారం ఉదయం 11 గంటలకు భద్రాచలంలోని తానీషా కల్యాణ మండపంలో ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అర్హులైన వ్యక్తులు ఈ వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.
అర్హత ప్రమాణాలు
అయితే, దేవస్థానానికి సంబంధించి బకాయిలు ఉన్నవారు లేదా వివాదాల్లో ఉన్నవారు ఈ వేలంలో పాల్గొనేందుకు అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

