దేశవ్యాప్తంగా 23 విద్యాసంస్థలలో క్వాంటం బోధనా సౌకర్యాలు, ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయం అత్యాధునిక క్వాంటం టెక్నాలజీలలో పరిశోధన, శిక్షణకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి సైన్స్ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల సంయుక్త నెలవారీ సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది. సమావేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరో 100 క్వాంటం బోధనా ప్రయోగశాలలు, సౌకర్యాల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇవి క్వాంటం టెక్నాలజీలలో అధునాతన పరిశోధనలు, శిక్షణకు మద్దతునిస్తాయి.
ఈ సమావేశంలో 2026లో జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) సన్నాహాలపై కూడా సమీక్షించారు. ఈ ఫెస్టివల్ కు పూణేను ప్రతిపాదిత వేదికగా గుర్తించారు. అలాగే, స్పేస్ రంగంలో తాజా పరిణామాలపై, ఈ ఏడాది చివర్లో ఉండబోయే తదుపరి PSLV మిషన్ సన్నాహాలపై, రాబోయే శాటిలైట్ ప్రయోగాలపై కూడా చర్చించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివిధ శాస్త్ర మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయడంపై, సహకార పరిశోధన కార్యక్రమాలను ప్రోత్సహించడంపై కూడా చర్చలు జరిగాయి. శాస్త్రీయ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.









