ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా, అనకాపల్లి జిల్లాలో ఆర్సెలోర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS India) ఏర్పాటు చేయనున్న భారీ సమీకృత ఉక్కు కర్మాగారానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోనే అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రాజెక్ట్ సైట్‌ను సందర్శించి, ప్లాంట్ నమూనాను పరిశీలించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఉక్కు కర్మాగారం కోసం AM/NS India 1.36 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది. నక్కపల్లి మండలం, రాజయ్యపేటలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్, వార్షికంగా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది.










