రాష్ట్రంలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. రాబోయే సోమవారం వరకు ఈ తీవ్ర వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
APSDMA ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగడం మానుకోవాలని సూచించారు. అధిక వేడిమి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శుక్రవారం (మే 22) నాటికి, కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45°C నుండి 47°C వరకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక వేడిమి నమోదయ్యే అవకాశం ఉంది.










