పర్యావరణ పరిరక్షణ
వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ వన్యమాంసం వినియోగం, అక్రమ కలప నిల్వను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆనందిపేటలో అటవీ శాఖ ఆకస్మిక తనిఖీలు.. వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ వన్యమాంసం వినియోగం, అక్రమ కలప నిల్వను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) సమక్షంలో నందిపేట సెక్షన్ పరిధిలోని రెస్టారెంట్లు, దాబాలు, కార్పెంటర్ షాపుల్లో అటవీ శాఖ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రెస్టారెంట్లు, దాబాల నిర్వాహకులకు వన్యప్రాణుల మాంసాన్ని వండడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వన్యమాంసాన్ని వినియోగించవద్దని సూచిస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.












