తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల ఉత్సవాలకు ముగింపుగా చివరి రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం (అవభృత స్నానం) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తజన సందోహంతో పుష్కరిణి పులకించింది. తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.












